తేనేటి విందుకు హాజరైన లింగాయత్ నాయకులు
లింగాయత్ సమాజ్ నాయకులకు రాయికోడ్ మండల పరిధిలోని సింగీతం గ్రామంలో లింగాయత్ నాయకులు ప్రశాంత్ పాటిల్ శనివారం తేనేటి విందు ఏర్పాటు చేసి మర్యాద పూర్వకంగా సన్మానించారు. అంతకు ముందు ఝరసంగం మండలం కప్పడ్ లో జరిగిన లింగాయత్ సమాజ్ జిల్లా నాయకులు, పోలిస్ పటేల్ మల్లన్న పటేల్, కుమారుడి తొట్టేల కార్యక్రమం కు పలువురు లింగాయత్ నాయకులు హాజరై చిన్నారి ని దీవించారు. కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ జిల్లా అద్యక్షుడు మదుశేఖర్, రాష్ట్ర యువత అద్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్, రాష్ట్ర నాయకులు కోట గుండప్ప, జిల్లా యువ నాయకులు ప్రశాంత్ పాటిల్, కాశీ బస్వరాజ్ పాటిల్, లింగాయత్ సభ్యులు కప్పాటి సంగమేశ్వర్ లింగాయత్,బద్రప్ప లింగాయత్, పేద్దలోడి వినోద్ లింగాయత్ పాల్గొన్నారు.