సంగారెడ్డి జిల్లాలోని రాయికోడ్ మండల టీఆర్ఎస్ పార్టీ యువనాయకులు పట్లోళ్ల ప్రశాంత్ పాటిల్ ఆదివారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ని తన నివాసంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి , మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వివరించారు. ఆయా గ్రామాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ప్రశాంత్ పాటిల్ ఎమ్మెల్యేని కోరామని అందుకు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎమ్మెల్యే ని కలిసిన వారిలో కాశి బస్వరాజ్ , మల్లు పటేల్ ,కోడూర్ మాజీ సర్పంచ్ యదన్నా ఉన్నారు